విశ్వమాత "సీతమ్మ"

A Global Web Series Mission

ఒక్క అడుగు సనాతన ధర్మం కోసం

Ancient truth. Modern storytelling. AI-powered spiritual epic created to bring the timeless message of Dharma to the world.

ఎందుకు నేను ?

మిషన్ సీతమ్మ – నా ప్రయాణం, ఒక దివ్య పిలుపు

2016 నుంచి 2020 వరకు నా జీవితంలో ఒక గట్టి అంతర్మథనం జరిగింది. బయటకు సాధారణ జీవితం కనిపించినా, లోపల ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, సంఘర్షణలు నడిచాయి. ఆధ్యాత్మికంగా ఎదగాలని కోరిక ఉన్నా, ఎన్నో విషయాల్లో స్పష్టత లేక మనసు ప్రశాంతంగా ఉండేది కాదు.

పుస్తకాలు చదివాను. ధ్యానం చేశాను. ఎన్నో మార్గాలు వెతికాను. ఎన్నో సమాధానాలు దొరికాయి. అయినా ఇంకా ఏదో లోటు, ఏదో అలజడి మిగిలే ఉండేది.ఆ సమయంలో నా జీవితంలో ఒక ప్రశ్న పెద్ద యుద్ధంలా మారింది: మాంసాహారం తినాలా? శాకాహారం తినాలా?ఈ సందేహానికి సమాధానం వెతికే క్రమంలో కొంత స్పష్టత వచ్చింది. నేను మాంసాహారం మానేశాను. కానీ అప్పుడప్పుడు కొన్ని సందేహాలు మళ్లీ అదే దారిలోకి లాగేవి. అప్పుడు నాకు అర్థమైంది — సమస్య కేవలం ఆహారంలో కాదు, అవగాహనలో ఉంది. అలాంటి సమయంలో నాకు సీతమ్మ తత్త్వం గురించి లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. మనందరికీ రామాయణం రాముడి కోణంలో బలంగా తెలుసు. కానీ సీతమ్మ కోణం, అలాగే ఈ కథలోని ఆధ్యాత్మిక అంతరార్థం తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ ఒక్క కథలోనే మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. ప్రపంచంలోని ఎన్నో బాధలకు మార్గాలు ఉన్నాయి.మనిషి జన్మ ధన్యం కావాలంటే వేల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఈ ఒక్క కథను సరిగ్గా అర్థం చేసుకుని, అందులోని సూత్రాలను ఆచరిస్తే — కొన్ని బాధలు వెంటనే తొలగిపోతాయి, ఇంకొన్ని క్రమంగా తగ్గిపోతాయి, జీవితం ప్రశాంతత వైపు సాగుతుంది. అప్పుడు నా మనసులో ఒక సంకల్పం పుట్టింది: ఈ కథ మరింత మందికి చేరాలి. నేను సినిమా రంగంలో 18 ఏళ్లుగా డైరెక్షన్ కోసం ప్రయాణం చేస్తున్నాను. అందుకే నాకు తెలిసిన మార్గం ద్వారా — visuals ద్వారా, కథ ద్వారా, సినిమాటిక్ రూపంలో ఈ సందేశాన్ని ప్రజలకు అందించాలని అనిపించింది. 100 కథలు చెప్పే కంటే ఈ ఒక్క కథ ముందుకు వెళ్తే చాలనిపించింది.

అలా మిషన్ సీతమ్మ అనే ఆలోచన మొదలైంది. ఈ ప్రయాణం సులభం కాదు. ఈ mission కోసం సినిమా career ను వదిలేయాల్సి వస్తుందా? ఇన్ని సంవత్సరాల కష్టం వదిలి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవడం సరైన నిర్ణయమా? అనే ప్రశ్నలు వెంటాడాయి. ఏ ప్రయత్నం చేసినా విఫలమవుతున్న కాలం కూడా వచ్చింది.నా financial పరిస్థితి కూడా బలంగా లేదు. అదే సమయంలో నాకు ఒక మరొక స్పష్టత వచ్చింది — ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగినప్పుడు, దానితో పాటు subtle ego కూడా పెరిగే అవకాశం ఉంటుంది. “నాకు తెలుసు”, “నేనే చేస్తాను” అనే భావన తెలియకుండానే రావచ్చు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కొంతకాలం అన్నీ పక్కన పెట్టి, మళ్లీ సినిమా వైపు వెళ్లి, ఆర్థికంగా స్థిరపడుదాం. తరువాత కూడా ఇదే పిలుపు లోపల బలంగా ఉంటే, నా సంపాదనతో ఈ mission ను ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాను. అయితే మరోవైపు, సీతమ్మ సందేశం, శాకాహారం, ధార్మిక జీవన విలువలు ప్రజల్లోకి వెళ్లాలి అనే ఉద్దేశంతో కొన్ని పెద్ద ఆధ్యాత్మిక వేత్తలు, సంస్థల పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం వచ్చింది. వారు ముందుకు వస్తే పని వేగంగా జరుగుతుందని అనిపించింది. కానీ కాలక్రమంలో ఒక స్పష్టత వచ్చింది — ఈ కార్యం వారి ద్వారా జరగాల్సింది కాదు. ఆ మార్గం తెరుచుకోలేదు. సహకారం ఆశించిన స్థాయిలో లభించలేదు. అప్పుడు నాకు అర్థమైంది — కొన్నిసార్లు పెద్ద పేర్లు, పెద్ద వేదికలు అవసరం కాదు. సంకల్పం నిజమైనదైతే, చిన్న ప్రారంభాల ద్వారానే పెద్ద కార్యాలు జరుగుతాయి. 2020 నుంచి 2025 వరకు అమ్మవారి కోసం ఒక్క పని కూడా చేయలేకపోయాను. ప్రతిసారి ప్రారంభించాలనుకుంటే ఏదో అడ్డంకి. కొన్నిసార్లు “ఇంకా అనుమతి రాలేదు” అనిపించేది. ఇప్పుడు మాత్రం పరిస్థితులు కొంచెం కొంచెంగా మారుతున్నాయి. సహకారం లభిస్తోంది. మార్గాలు తెరుచుకుంటున్నాయి. పని ప్రారంభించడానికి సమయం దగ్గరపడిందని అనిపిస్తోంది. అయితే నా దగ్గర డబ్బులు వచ్చిన తరువాతే మొదలుపెట్టాలి అనే ఆలోచన ఇప్పుడు సరైంది కాదని అర్థమైంది. ఎందుకంటే —

ఆలోచన ఎవరిది? ఆచరణకు ప్రేరణ ఎవరిది?

ఈ mission చేయాలని నా హృదయంలో బలంగా నాటింది అమ్మవారే అయితే, దీన్ని నా దగ్గరే ఆపకూడదు. ఈ mission లో ఎందరో భాగస్వాములు కావాలని ఆమె సంకల్పం అయి ఉండవచ్చు. ఈ ఆశయం కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకెంతమందో ఉండవచ్చు. వారికి తెలిసేలా చేయడం కూడా ఈ mission లో భాగమే. అందుకే ఈ project ను మీ అందరి ముందుకు తీసుకువస్తున్నాను.

ఇది నా mission కాదు. నా ద్వారా అమ్మవారు ఎందరినో కలిపి, ఎందరికో కర్మ ప్రక్షాళనకు అర్హత కల్పించి, ధర్మ మార్గంలో ముందుకు నడిపించే ఒక యజ్ఞం అని నేను నమ్ముతున్నాను.

మీరు ఎలా భాగస్వాములు కావచ్చు?

మీ సహకారం ద్వారా ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి:

– మిషన్ సీతమ్మ డిజిటల్ ప్రచారం

– పాటలు, వీడియోలు, వెబ్ సిరీస్ నిర్మాణం

– సీతారామ తత్త్వ ప్రచారం

– శాకాహారం & సాత్విక జీవన అవగాహన

– యువతకు ధార్మిక ప్రేరణ కార్యక్రమాలు

– భవిష్యత్ సేవా కార్యక్రమాలు

మీ donation అంటే కేవలం డబ్బు కాదు

ఇది ఒక శుభసంకల్పానికి మద్దతు.

ఒక యజ్ఞంలో భాగస్వామ్యం.

ఒక జీవితం మారడానికి మీరు చేసే సహాయం.

జై సీతారామ్

Why This Series

రామాయణాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ అసలైన సారం, ఋషులు మనకు తెలియజేయాలనుకున్న జీవన మార్గం, ధర్మ బోధ, ఎన్నో సందేహాలకు సమాధానాలు ప్రపంచానికి పూర్తిగా చేరలేదు. ఈ series ద్వారా సీతమ్మ వారి మహత్యం, నిజాలు, త్యాగాలు, ధర్మం, మానవజాతి ఎలా జీవించాలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది కేవలం కథ కాదు. ఇది ఒక జ్ఞానయజ్ఞం. ఇది మనకు తెలిసిన సీతారాముల కథలా ఉండదు. ఇది ఒక అతీతమైన జీవన మార్గంలా ఉంటుంది. ఈ కథ విన్నాక ఏ కథ వినాల్సిన అవసరం ఉండదు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఎప్పుడో త్రేతాయుగంలో చెప్పుకున్న స్టోరీ ఇప్పటికీ ఈ ai యుగంలో కూడా మనతోనే పదిలంగా ఉందంటే ఆ కథలో మనకు తెలియని మన కనెక్షన్ ఉంది. ఈ కథ సీతారాముడు రావణుడిది కాదు. ఇది మన కథ. ఈ series మనల్ని సీతారాములకు దగ్గర చేస్తుంది అలాగే సీతారాములకు మనల్ని దగ్గర చేస్తుంది. ఊహించని విధానంలో కథ చెప్పబడుతుంది.

What Makes It Unique?

Questions This Series Explores

రామాయణం ద్వారా మనం ఏమి తెలుసుకోవాలి?

ఎప్పుడో రాయబడిన కథ ఇప్పుడు మనకు ఎలా ఉపయోగపడుతుంది?

సీతమ్మ వారి అసలైన ఆంతర్యం ఏమిటి?

రాముడు గురించి వచ్చిన అపోహలకు సమాధానం ఏమిటి?

సీతమ్మ పై పడ్డ నింద మన మనసుల్లో నుంచి చెరిపివేయడం ఎలా?

ధర్మం అంటే ఏమిటి?

మానవ జీవితం ఎలా గడపాలి?

హనుమంతుడు ఈ కథను చెప్పడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి? సీతమ్మ పై పడ్డ నిందను తొలగించడానికి హనుమాన్ చేసిన త్యాగం ఏంటి?

ఈ కథ వింటే మనలో మార్పు ఎలా వస్తుంది?

Explore the Vision

Poster

Viswamata Seethamma poster

Trailer

Explore the Full Vision

Experience the complete story, vision and execution plan

Viswamata Seethamma Pitch deck by Veerabrahmam Nakka

Posters, concept art, teaser videos, scene previews, and updates will be shared here.

Why Crowdfunding?

ఈ కథ ప్రపంచానికి చేరాలి.

సినిమా లేదా web series Netflix స్థాయిలో నిర్మించాలంటే భారీ బడ్జెట్ అవసరం.

ఖర్చు తగ్గించడానికి, quality పెంచడానికి, ప్రపంచ స్థాయిలో అందించడానికి AI filmmaking ను ఉపయోగిస్తున్నాము.

ఇది ఒక వ్యక్తి project కాదు.

ఇది collective mission.

Be Part of This Dharma Mission

రామకార్యంలో వానరులు, పక్షులు, చివరికి ఉడత కూడా తమ వంతు సహాయం చేశాయి.

ఈరోజు విశ్వామాత సీతమ్మ వారి సందేశాన్ని ప్రపంచానికి చేర్చే ఈ కార్యంలో మీ పాత్ర ఏంటో  నిర్ణయించుకోండి.

మీ support చిన్నదైనా పెద్దదైనా – అది ఈ mission కి శక్తి.

Support Now

Fill the form below to contribute and become part of this sacred creative journey.

Suggested Form Fields:

Name

Support as you like

OR Scan QR to Support

QR code

Why Your Support Matters

Every contribution helps bring Mission Seethamma to life with quality, devotion, and purpose

🛡️Transparent Usage

Funds are used for production, visuals, music, and promotion.

🌍Official Project

Managed by VBR AI Studio with website presence and regular updates.

❤️Made with Purpose

A meaningful story created to inspire future generations.

Together, let us bring truth, devotion, and Dharma to future generations through world-class storytelling.

Be Part of Mission Seethamma

Scroll to Top